LOLLIPOP song lyrics penned by Suresh Banisetti, music composed by Vijai Bulganin, and sung by SidSriram from the movie Private Song.

Song Name | LOLLIPOP |
Singer | SidSriram |
Music | Vijai Bulganin |
Lyricst | Suresh Banisetti |
Movie | Private Song |
LOLLIPOP Song lyrics
మొదటిసారి మొదటిసారి ప్రేమ గాలే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం కలువలాంటి కనులలోన కలలవాయనే దూకుతుంటే ఏది గానం ఏది నాట్యం తేలదాయె అయ్యో పాపం తీపిగా ఊహలన్ని చుట్టుముట్టుకున్న వేళ మనసుకే లొంగిపోడమే ఇష్టం వరదలా ఆశలన్నీ కట్ట తెంచుకున్న వేళ వయసునే పట్టుకోడమే కష్టం అర్ధం కాని సరికొత్త చదువుని రాత్రి పగలు చదివేయడం అద్ధం ముందు ఇన్నాళ్ళు ఎరుగని అందం మెరుగు దిద్దేయడం అంత గజిబిజిగా ఉంటుందే అంతా తికమకగా ఆ ఆ ఆ కాలం కదలదే మైకం తొలగదే మొహం విడువదే ప్రేమే ఉంటే దూరం జరగదే భారం తరగదే తీరం దొరకదే ఇంతే ప్రేమలోన ఉంటే రెండే కళ్ళు కదా అవి కలలకి ఇల్లు కదా ఎన్ని పనిచేస్తున్నా ఇంకొన్ని మిగిలే ఉండునుగా ఒకటే గుండె కదా అది మరి తలపుల కుండ కదా ఎంత ఒంపేస్తున్నా అవ్వదు ఖాళీయేగా ప్రతి మాట చిత్రం ప్రతి పూట చైత్రం ప్రతి చోట ఏదో ఒక ఆత్రం ప్రతి చూపు అందం ప్రతి వైపు అందం ప్రతి గాలి ధూళీ గంధం కాలం కదలదే మైకం తొలగదే మొహం విడువదే ప్రేమే ఉంటే దూరం జరగదే భారం తరగదే తీరం దొరకదే ఇంతే ప్రేమలోన ఉంటే మొదటిసారి మొదటిసారి ప్రేమ గాలే తాకుతుంటే ఏది స్వర్ణం ఏది వర్ణం తెలియదాయే అయ్యో పాపం అదుపులేని పొదుపులేని కుదుపులే ఓ చేరుకుంటే ఏది స్వప్నం ఏది సత్యం తెలదాయే అయ్యో పాపం కడలిలా అంతులేని వింత హాయి పొంగుతుంటే పడవలా కొట్టుకెళ్ళదా ప్రాయం అడవిలా దట్టమైన ఆదమరపు కమ్ముకుంటే నెమలిలా చిందులెయ్యదా ప్రాణం చిత్తం చెదరగొట్టేది అంటే ప్రేమాకర్షణే కాదా మొత్తం రెండు హృదయాల నడుమ తీరని ఘర్షణే రాదా ఏదో సతమతమే రోజంతా ఏదో కలవరమే ఏ ఏఏ కాలం కదిలెనే మైకం తొలిగెనే మౌనం కరిగెనే ప్రేమ వల్లే దూరం జరిగెనే భారం తరిగెనే తీరం దొరికెనే అంతా ప్రేమ మాయ వల్లే
No comments:
Post a Comment